టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ : బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-04-10T02:54:40+05:30 IST

టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ : బండి సంజయ్‌

సిరిసిల్ల: టీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీ పిక్నిక్ స్పాట్ అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టైమ్‌పాస్ కాకపోతే కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్తారని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల నుంచి ధాన్యం కొన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు కొనట్లేదు? అని ప్రశ్నించారు. ధాన్యం కొంటావా.. గద్దె దిగుతావా కేసీఆర్ అని నిలదీశారు.‘‘నీ మంత్రులు కూడా హుజురాబాద్‌లో వరి వేయాలని చెప్పారు.. నీ ఫామ్‌హౌస్‌లో వేసిన వరి ఎక్కడ అమ్ముకుంటావ్’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-10T02:54:40+05:30 IST