పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-07-04T00:23:23+05:30 IST

ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చూస్తే బాధగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ సంకల్ప సభలో ...

పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్

సికింద్రాబాద్: ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చూస్తే బాధగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మోదీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రజలకు సేవ చేస్తున్నందుకా? వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినందుకా?.  పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా?. కష్టకాలంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకోచ్చినందుకా?. మోదీపై విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.  దేశ ప్రజల పాలిట దేవుడు మోదీ. పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి. ఇకపై మోదీని విమర్శిస్తే ఊరుకునేది లేదు.’’ అని బండి సంజయ్ హెచ్చరించారు. 
Updated Date - 2022-07-04T00:23:23+05:30 IST