రేపటి నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర
ABN , First Publish Date - 2022-03-05T07:09:45+05:30 IST
బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 300 రోజులు కొనసాగే ఈ యాత్ర జనగాం జిల్లా ఖిలాషాపూర్‌లోని బహుజన సామ్రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోట వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.