మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌లో... నారాయణ విద్యార్థుల ప్రతిభ !

ABN , First Publish Date - 2022-11-25T03:58:55+05:30 IST

రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌లో తమ సంస్థ విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచారని నారాయణ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ డీజీఎం గోపాల్‌ రెడ్డి ప్రకటించారు.

మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌లో...  నారాయణ విద్యార్థుల ప్రతిభ !

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌లో తమ సంస్థ విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచారని నారాయణ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ డీజీఎం గోపాల్‌ రెడ్డి ప్రకటించారు. కొంగరకలాన్‌లోని నారాయణ సీవో ఒలింపియాడ్‌ బాలికల హాస్టల్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ఇందులో ఫైనల్‌కు చేరిన 55 మంది విద్యార్థులు డెలిగేట్స్‌లాగా వ్యవహరించి కాన్ఫరెన్స్‌లో విశేష ప్రతిభ కనబరిచారని తెలిపారు. ప్రపంచంలో శాంతిస్థాపన, ఉన్నత విద్య, మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కారాలు, సూచనలు పంచుకున్నారని వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేసినట్టు చెప్పారు.

Updated Date - 2022-11-25T03:58:55+05:30 IST

Read more