అసంబద్ధంగా అధికారులను కేటాయించారు

ABN , First Publish Date - 2022-04-05T08:19:32+05:30 IST

ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అసంబద్ధంగా వ్యవహరించిందని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆరోపించారు.

అసంబద్ధంగా అధికారులను కేటాయించారు

కేడర్‌ విభజనపై హైకోర్టులో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వాదన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అసంబద్ధంగా వ్యవహరించిందని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆరోపించారు. ఏపీకి కేటాయించినప్పటికీ సెంట్రల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల అండతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా కేంద్రం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ నందా ఽధర్మాసనం విచారణ చేపట్టింది. సోమేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ... ఐఏఎస్‌, ఐపీఎ్‌సల కేటాయింపు ప్రక్రియలో కేంద్రం అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించిందని తెలిపారు. నిబంధనల ప్రకారం కేటాయింపులు జరిగి ఉంటే తాను తెలంగాణకు వచ్చేవాడినని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం..విచారణను 7కు వాయిదా వేసింది.

Updated Date - 2022-04-05T08:19:32+05:30 IST