ఆరుట్ల కమల జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-12-17T23:46:17+05:30 IST

Arutla Kamala's life is inspiring నిజాం నిరంకుశత్వానికి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఆరుట్ల కమలాదేవి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.

ఆరుట్ల  కమల జీవితం స్ఫూర్తిదాయకం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునీత

మోటకొండూరు, డిసెంబర్‌ 17: నిజాం నిరంకుశత్వానికి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఆరుట్ల కమలాదేవి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి స్మారక క్రీడోత్సవాలను ఆరుట్ల సుశీల దేవి, సర్పంచ వడ్డెబోయిన శ్రీలతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబుల కాలంలో ఆడవారిని తక్కువగా చుస్తున్న సమయంలో ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటాన్ని ఎంచుకుని ఆలేరు ప్రాంతానికి వన్నె తెచ్చిన వీర వనిత అని అన్నారు. ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రరెడ్డిల జ్ఞపకార్థంగా ఆరుట్ల సుశీలదేవి ట్రస్టు ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరా, వైస్‌ ఎంపీపీ ఇల్లేందుల మల్లేష్‌, ఉప సర్పంచ రేగు శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యయులు రాఘురాంరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి, మాణిక్యం, స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి స్టాలిన బాబు, కృష్ణ మూర్తి, మధు, వినోద్‌ కూమార్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-17T23:46:31+05:30 IST