జేఈఈ అడ్వాన్స్‌కు 7 నుంచి దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-08-04T10:01:00+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌కు ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 28వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌కు 7 నుంచి దరఖాస్తులు

28న పరీక్ష.. 6న జేఈఈ మెయిన్స్‌-2 ఫలితాలు

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌కు ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 28వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. మెయిన్స్‌-1 ఫలితాలను ఇప్పటికే ప్రకటించగా, మెయిన్స్‌-2కు సంబంధించిన ఫలితాలను 6వ తేదీన ప్రకటించనున్నారు. ఇవి వెల్లడైన తర్వా త జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించే విద్యార్థులకు సంబంధించిన జాబితాపై స్పష్టత రానుంది. ఈ జాబితాలోని విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షను రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 12వ తేదీ చివరి గడు వు. అభ్యర్థులు ఈ నెల 23 నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-08-04T10:01:00+05:30 IST