ఎనిమిది మెడికల్ కాలేజీలకు దరఖాస్తుc
ABN , First Publish Date - 2022-08-04T10:46:35+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా మరో 8 వైద్యవిద్య కళాశాలలకు ఈ నెల 8 లేదా 9 తేదీల్లో దరఖాస్తు చేయనున్నట్లు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 8 లేదా 9న చేస్తాం: డీఎంఈ
హైదరాబాద్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో 8 వైద్యవిద్య కళాశాలలకు ఈ నెల 8 లేదా 9 తేదీల్లో దరఖాస్తు చేయనున్నట్లు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కామారెడ్డి, సిరిసిల్ల, జనగాం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, కరీంనగర్, ఖమ్మంలో కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేస్తామన్నారు. దరఖాస్తుకు ఈ నెల 10 చివరి తేదీ అని, ఆలోపుగానే ఎన్‌ఎమ్‌సీ వెబ్‌సైట్‌లో కొత్త కాలేజీల కోసం అప్లై చేయనున్నట్లు డీఎంఈ వెల్లడించారు. 100 ఎంబీబీఎస్ సీట్లతో ఒక్కో కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. కాగా గత ఏడాది సెప్టెంబరు 25న సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్, రామగుండంలో కొత్త మెడికల్ కాలేజీ కోసం దరఖాస్తు చేశారు. వాటిలో ఇప్పటికే జాతీయ వైద్య మండలి రెండు దఫాలుగా తనిఖీలు చేసింది. నిబంధనల మేరకు ఉన్న జగిత్యాల మెడికల్ కాలేజీకి సూత్రప్రాయంగా అనుమతులు జారీ చేసింది. మిగిలిన వాటికి కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని డీఎంఈ తెలిపారు.