మాకు జాబ్ రాకుంటే మీ జాబ్ పీకేస్తాం: ఏపీ నిరుద్యోగులు

ABN , First Publish Date - 2022-01-31T23:37:06+05:30 IST

ఏపీ సీఎం జగన్ సర్కార్‌పై ఏపీ నిరుద్యోగులు తీవ్రస్థాయిలో

మాకు జాబ్ రాకుంటే మీ జాబ్ పీకేస్తాం: ఏపీ నిరుద్యోగులు

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్ సర్కార్‌పై ఏపీ నిరుద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరంలోని గాంధీ నగర్ పార్క్ దగ్గర ఏపీ ఉద్యోగ పోరాట సమితి అధ్వర్యంలో నిరుద్యోగులు రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ గారు మాకు జాబ్ రాకుంటే మీ జాబ్ పీకేస్తామని హెచ్చరించారు. అన్న వస్తే జాబు అన్నారని.. మరేదని నిరుద్యోగులు ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాకు ఉద్యోగాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు కుదించాలన్నారు. నోటిఫికేషన్లు వేయక పోతే తాడేపల్లిని ముట్టడిస్తామని ఏపీ నిరుద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ స్టడీ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు,  ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికేపుడి శ్రీనివాస్ రావు హాజరయ్యారు. 

Updated Date - 2022-01-31T23:37:06+05:30 IST