భక్తి శ్రద్ధలతో అనఘాష్టమి వ్రతాలు
ABN , First Publish Date - 2022-12-16T23:55:14+05:30 IST
విశ్వశాంతి పేరిట దత్త పీఠాధిపతి గణపతి సచ్చిందానందస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో సామూహిక అనఘాష్టమి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన దంపతులతో కళాశాల మైదానం కిటకిటలాడింది. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతపరింపజేసుకుంది. జై గురుదత్త నినాదాలు ప్రతిధ్వనించాయి.
మార్మోగిన జైగురుదత్త నామస్మరణ
పాల్గొన్న పలువురు ప్రముఖులు
హనుమకొండ కల్చరల్, డిసెంబరు 16: విశ్వశాంతి పేరిట దత్త పీఠాధిపతి గణపతి సచ్చిందానందస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో సామూహిక అనఘాష్టమి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన దంపతులతో కళాశాల మైదానం కిటకిటలాడింది. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతపరింపజేసుకుంది. జై గురుదత్త నినాదాలు ప్రతిధ్వనించాయి.
నేల పునీతం
విశేష మార్గశిర మాసంలో కులమతాలకు అతీతం గా ఒకే వేదిక ద్వారా సుమారు 15వేల మంది దంపతులతో సామూహిక అనఘాష్టమి వ్రతాలతో ఓరుగల్లు నేలంతా పునీతమైందని గణపతి సచ్చిందానంద స్వామి వ్యాఖ్యానించారు. జ్యోతి వెలిగించి వ్రతాలను ప్రారంభించిన స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు. ఈనేల ద్వారా యావత్ జిల్లా, రాష్ట్రం, దేశమంతా సుభిక్షం అవుతుందని అన్నారు. కలియుగంలో మూడు దశాబ్దాలుగా దత్తక్షేత్రలకే పరిమితమైన ఈ వ్రతాలు చరిత్రలోనే తొలిసారిగా సామూహికంగా ఇంత పెద్దఎత్తున నిర్వహించజేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వేదిక మీద స్వామీజీ వ్రతాన్ని ఆచరిస్తూ వేలాదిమంది దంపతులతో ఆచరింప చేశారు.
నిష్టతో..
మూడుగంటల పాటు మైసూరు పీఠ వేద పండితు లు కల్యాణ్శర్మ, గణేశ్‌శర్మ, విజయకుమారచార్య తదితరుల అధ్వర్యంలో వేద మంత్రాల సాక్షిగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. వేదిక వద్దకు వచ్చిన స్వామీజీకి ఆలయ ట్రస్టీలు వైవీ వామన్‌రావు, అర్జున్‌రావు, డాక్టర్ శార్వాణి, లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కృష్ణప్రసాద్, తదితరులు ఽఘనంగా స్వాగతించారు. విశాలమైన వేదికపై భద్రకాళి మాత, రుద్రేశ్వరుడు, బతుకమ్మ తల్లి, తదితర విగ్రహాలను ఏర్పాటు చేసి శోభయమానంగా తీర్పిదిద్దారు. రాత్రి ఇదే వేదికపై గణపతి సచ్చిందానందస్వామి ఆధ్వర్యంలో సామూహిక