రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-31T00:42:07+05:30 IST

రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆలేరు రైల్వే స్టేషనలో ఈ ఘటన జరిగింది.

రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య

ఆలేరు, డిసెంబరు 30: రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆలేరు రైల్వే స్టేషనలో ఈ ఘటన జరిగింది. రాత్రి సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 70 సంవత్సరాల వయస్సు కలిగి, గోధుమరంగు షర్ట్‌, తెలుపు రంగు దోవతి తలకు రుమాలు ధరించి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న భువనగిరి రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. వివరాల కోసం భువనగిరి రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-12-31T00:42:08+05:30 IST