Ambulanceకు దారివ్వబోయి ఫుట్‌పాత్ పైకి..
ABN , First Publish Date - 2022-05-18T13:49:11+05:30 IST
వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఓ యువతి కారును ఫుట్‌పాత్ ఎక్కించిన సంఘటన జూబ్లీహిల్స్‌లోని నటుడు
హైదరాబాద్ సిటీ: వెనుక నుంచి వస్తున్న అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఓ యువతి కారును ఫుట్‌పాత్ ఎక్కించిన సంఘటన జూబ్లీహిల్స్‌లోని నటుడు బాలకృష్ణ ఇంటి ముందు మంగళారం జరిగింది. యువతి వాహనాన్ని వేగంగా నడపడంతోనే ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. డ్రైవింగ్ సీటులో ఉన్న యువతికి ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష జరపగా మద్యం తాగలేదని తేలింది. వాహనాన్ని అక్కడి నుంచి తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.