Allu Arjun Tribute Krishnamraju: భోజనానికి పిలుద్దామనుకున్నాను.. ఇంతలోనే..!
ABN , First Publish Date - 2022-09-12T01:20:54+05:30 IST
తమ ఇంటికి భోజనానికి రాకుండానే కృష్టంరాజు వెళ్ళిపోతారనుకోలేదని హీరో అల్లు అర్జున్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో...
హైదరాబాద్ (Hyderabad): తమ ఇంటికి భోజనానికి రాకుండానే కృష్టంరాజు (Krishnamraju) వెళ్ళిపోతారనుకోలేదని హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. జూబ్లీహిల్స్‌లో కృష్ణంరాజు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. కృష్టంరాజు ఇంటికి దగ్గర్లోనే తాను సొంతిల్లు కట్టుకుంటున్నానని తెలిపారు. ఇల్లు పూరైన తర్వాత కృష్టంరాజు ఫ్యామిలీని భోజనానికి పిలవాలనుకున్నానని.. ఇంతలోనే కన్నుమూశారని అల్లు అర్జున్ అన్నారు.
కాగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో కృష్ణంరాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో సందర్శనార్ధం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఉంచారు. ఈ మేరకు కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణంరాజు పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
