కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితి మరో రెండేళ్లు సడలించాలి: బీజేవైఎం

ABN , First Publish Date - 2022-05-18T09:44:48+05:30 IST

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితిని మరో రెండేళ్లు సడలించాలని బీజైవెం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితి మరో రెండేళ్లు సడలించాలి: బీజేవైఎం

హైదరాబాద్‌, మే17 (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం వయో పరిమితిని మరో రెండేళ్లు సడలించాలని బీజైవెం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఇచ్చిన మూడేళ్ల వయో పరిమితి సడలింపు సరిపోదన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో వయస్సు మీరి సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులు అనర్హులుగా మారారని తెలిపారు. ప్రభుత్వం, తమ డిమాండ్‌కు అనుగుణంగా స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈనెల 20 వరకే ఉన్న దరఖాస్తు గడువును మరో 15రోజులు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.  

Read more