నెలాఖరువరకు ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T23:08:09+05:30 IST

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు మండ లానికి రెండు చొప్పున ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

నెలాఖరువరకు ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 12: మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు మండ లానికి రెండు చొప్పున ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లో మంగళ వారం అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌ పాయి, విద్యాశాఖాధికారి అశోక్‌తో కలిసి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల విద్యాధి కారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి రెండు ఆదర్శ పాఠశాలల చొప్పున 30 పాఠశాలల్లో తాగునీరు, మూత్ర శాలలు, విద్యు త్‌, పెయింటింగ్‌, ఇతరాత్ర అన్ని పనులు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలి పారు. పనులు పూర్తయిన పాఠశాలల ఫొటోలను సంబంఽ దిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయా లన్నారు. అనంతరం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో మాట్లాడుతూ జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్య క్రమంలో భాగంగా జిల్లాలోని దృష్టి సమస్య ఉన్న వారు పథకాన్ని వినియోగించు కునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలి పారు. ఈ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రభాకర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:08:09+05:30 IST

Read more