టీచర్లపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-31T00:54:10+05:30 IST

అనుమతి లేకుండా సగానికి పైగా ఉపాధ్యాయులు పాఠశాలకు గైర్హాజరవడంపై జడ్పీచైర్మన బండా నరేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీచర్లపై చర్యలు తీసుకోవాలి
పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి

టీచర్లపై చర్యలు తీసుకోవాలి

నక్కలపల్లి జడ్పీహెచఎ్‌స ఆకస్మిక తనిఖీ

నార్కట్‌పల్లి, డిసెంబరు 30: అనుమతి లేకుండా సగానికి పైగా ఉపాధ్యాయులు పాఠశాలకు గైర్హాజరవడంపై జడ్పీచైర్మన బండా నరేందర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆయన ఆదేశించారు. మండలంలోని తన స్వగ్రామమైన నక్కలపల్లి జడ్పీహెచఎ్‌సను జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మొత్తం 8 మంది ఉపాధ్యాయులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగతా 5 గురు గైర్హాజరవడంపై ఆయన స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్‌కు ఫోన చేశారు. ఉ పాధ్యాయుల సెలవుపై ఆరా తీయగా తనకు తెలియదని సమాధా నం చెప్పడంతో తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన ఉపాధ్యాయుల్లో హెడ్మాస్టర్‌ కూడా ఉండటంతో వెంటనే డీఈవోకు ఫోన చేసి సెలవుపై ఆరా తీయగా తనకు సమాచారం లేదని కూడా చెప్పడం తో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సు మారు గంటన్నర పాటు పాఠశాలలోనే గడిపారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఆయన వెంట ఎం పీటీసీ కనుకు అంజయ్య, ఈద నర్సింహ, ఉపసర్పంచి శ్రీపతి సైదు లు, భాషపాక రవికుమార్‌, గుత్తా కరుణాకర్‌రెడ్డి, వరికుప్పల వెంక న్న, జిల్ల పృథ్వీ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:54:10+05:30 IST

Read more