మున్సిపల్ కమిషనర్‌ను అవమానించిన ఆర్‌డీవోపై చర్యలు తీసుకోవాలి: టీజీవో
ABN , First Publish Date - 2022-12-07T03:52:19+05:30 IST
జనగామ మున్సిపల్ కమిషనర్ రజితను అవమానించిన ఆర్‌డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనగామ మున్సిపల్ కమిషనర్ రజితను అవమానించిన ఆర్‌డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల(టీజీవో) సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆర్‌డీవో అనుచిత వ్యాఖ్యలతో అవమానించారని ఆరోపించారు. మహిళా అధికారులను చులకన భావంతో చూడడం సరికాదని, ఏవైనా సమస్యలుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.