బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-11T09:44:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి

సీఈవోకు టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, క్షుద్రపూజలు అంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఈ వ్యాఖ్యలు చేసినందుకు సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ గుర్తయిన కారును పోలిన ఇతర అభ్యర్థుల గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ బుద్ధభవన్‌లోని ఈసీ కార్యాలయంలో సీఈవోను కలిసి వినపతిపత్రం సమర్పించారు.

Read more