రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ABN , First Publish Date - 2022-05-18T20:56:07+05:30 IST
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు పెళ్లి సామాన్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మృతులు సీతమ్మ, బిచ్య, స్వామి, గోవింద్, శాంతమ్మగా గుర్తించారు. మృతులంతా పర్షతండాకి చెందిన వారు. శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు