రాయదుర్గం నందిహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2022-04-24T03:38:16+05:30 IST
రాయదుర్గం నందిహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిహిల్స్ దగ్గర బైక్పై వెళ్తూ అదుపుతప్పి కానిస్టేబుల్ గోపాల్ కిందపడిపోయాడు. వెనక వైపు నుంచి వస్తున్న బస్సు బైక్ను ఢీకొనడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.