కొనసాగుతున్న ఏసీబీ విచారణ

ABN , First Publish Date - 2022-10-18T04:50:15+05:30 IST

కొనసాగుతున్న ఏసీబీ విచారణ

కొనసాగుతున్న ఏసీబీ విచారణ

మట్టెవాడ, అక్టోబరు 17: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పన్నుల విభాగం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ల అవినీతిపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 12న ఆర్‌ఐ రబ్బానీ, బిల్‌ కలెక్టర్‌ రంజిత్‌లు లంచం డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఏసీబీ అధికారులు ఆర్‌ఐ రబ్బానీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే సుమారు రూ.7 లక్షల నగదు, కొన్ని డాక్యుమెంట్లు లభించాయి. రెండు రోజులుగా అధికారులు రబ్బానికి సంబంధించిన ఆస్తి వివరాలు, బ్యాంక్‌ అకౌంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అకౌంట్లలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు తెలిసింది. కార్పొరేషన్‌లో ఆర్‌లుగా పనిచేస్తున్న కొంత మందిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడంతో వారు సెలవు బాటపట్టారు. ఆర్‌ఐల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపైన ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్‌ఐలుగా పనిచేస్తున్నారు. వారి ఆదాయం, ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కొంత మందికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ట్లు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్పష్టత రావడానికి మరికొంత స మయం పట్టే అవకాశం ఉంది. పన్నుల విభాగంలో అవినీతి ఏ విధంగా జరుగుతున్నాయనే విషయంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనుల్లో అధికారులు ఉన్నారు.


Updated Date - 2022-10-18T04:50:15+05:30 IST