TS News: తెలంగాణ సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2022-09-15T23:42:28+05:30 IST

ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేయడంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 75 రోజుల్లోనే కోటి మంది ఓటర్ కార్డులు ఆధార్‌కు లింక్ చేశారు.

TS News: తెలంగాణ సరికొత్త రికార్డు

హైదరాబాద్: ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేయడంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 75 రోజుల్లోనే కోటి మంది ఓటర్ కార్డులు ఆధార్‌కు లింక్ చేశారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుంచి ఇతరత్రా లావాదేవీలన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఓటరు కార్డు వంతు వచ్చింది. ఎన్నికల్లో పదే పదే దొంగ ఓట్లు వేస్తున్నారని, బూత్‌ల స్వాధీనానికి ప్రయత్నిస్తు న్నారని, ఏకపక్ష పోకడలకు వెళుతున్నారని ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు చేరాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దేశమంతటా ఓటరు కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2022-09-15T23:42:28+05:30 IST