ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్‌

ABN , First Publish Date - 2022-06-12T09:10:46+05:30 IST

ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్‌

ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్‌

ఉచితంగా నమోదుకు తపాలా శాఖ ఏర్పాట్లు


హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్‌ నమోదుకు తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. 28 జిల్లాల్లోని 1,552 మంది గ్రామీణ డాక్‌ సేవకులు, పోస్ట్‌మెన్‌ల ద్వారా ఈ ప్రక్రియను ఉచితంగా చేయించనున్నట్టు హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ కార్యాలయ సహాయ డైరెక్టర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల ఆధార్‌ నమోదు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖతో అంగీకారం కుదిరిందన్నారు.  

Read more