సీఎం సభలో అస్వస్థతకు గురైన మహిళ మృతి

ABN , First Publish Date - 2022-08-31T08:45:16+05:30 IST

పెద్దపల్లిలో ఈనెల 29న జరిగిన సీఎం కేసీఆర్‌ సభలో అస్వస్థతకు గురైన మహిళ చికిత్స పొందుతూ మరణించింది.

సీఎం సభలో అస్వస్థతకు గురైన మహిళ మృతి

పెద్దపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లిలో ఈనెల 29న జరిగిన సీఎం కేసీఆర్‌ సభలో అస్వస్థతకు గురైన మహిళ చికిత్స పొందుతూ మరణించింది. జిల్లాలోని ఓదెల మండలం నాంసానిపల్లికి చెందిన మిట్టపల్లి రాధమ్మ (60) సోమవారం పెద్దపల్లి సభకు ఆర్టీసీ బస్సులో గ్రామస్థులతో కలిసి వచ్చింది. 5 గంటలకు సభ పూర్తయిన తర్వాత పార్కింగ్‌ స్థలంలో బస్సు వచ్చేవరకు వేచి చూస్తున్న క్రమంలో ఆమెకు గుండెనొప్పి రావడంతో గ్రామస్థులు కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మరోవైపు సీఎం సభకు వచ్చిన కమాన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మహిళలు.. సెవన్‌ సీటర్‌ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. 

Read more