ఆకాశం నుంచి కింద పడిన టైం మిషన్‌ను పోలిన వస్తువు
ABN , First Publish Date - 2022-12-07T12:10:41+05:30 IST
ఆకాశం నుంచి ఒక వింత ఆకారం నేలను తాకింది. అది మరెక్కడో కాదు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో.. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు.
వికారాబాద్ : ఆకాశం నుంచి ఒక వింత ఆకారం నేలను తాకింది. అది మరెక్కడో కాదు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో.. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు. చూడబోతే అది.. ఆదిత్య 369 సినిమాలో ఉండే టైం మిషన్(Time mission_లా అనిపిస్తోంది. బెలూన్ వంటి పెద్ద ఫాలిథిన్ కవర్ ద్వారా కిందకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. గుండ్రంగా ఉన్న భారీ వస్తువు పంటపొలాల్లో ప్రత్యక్షమవ్వడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురయ్యారు. దానిలోపల కెమరాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అ వస్తువు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు. నాలుగేళ్ళ క్రితం కూడా ఇలాంటి వస్తువే ఒకటి వికారాబాద్ జిల్లా దోమ మండల అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖకు సంబంధించిన సామాగ్రి అని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి వస్తువే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పంటపొలాల్లో ఆకాశం నుంచి పడడం స్థానికంగా కలకలం రేపుతోంది.