నష్టంపై ప్రాథమిక అంచనా

ABN , First Publish Date - 2022-08-04T09:35:48+05:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్‌లోని మోటర్ల మునకపై ప్రభుత్వానికి అధికారులు

నష్టంపై ప్రాథమిక అంచనా

అన్నారంలో తక్కువే.. మేడిగడ్డలో ఎక్కువ నష్టం

సర్కారుకు నివేదిక సమర్పించిన అధికారులు

హైదరాబాద్‌, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్‌లోని మోటర్ల మునకపై ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సరస్వ తి  పంప్‌హౌస్‌లో నష్టం తక్కువేనని, ఇక్కడ మో టార్లకు నష్టం వాటిల్లకపోయినా ఎలకా్ట్రనిక్‌, ఎలక్ట్రికల్‌ పరికరాలు దెబ్బతిన్నాయని, నెలరోజుల్లో ఎత్తిపోతల కోసం మోటార్లు సిద్ధం అవుతాయని నివేదించారు. సరస్వతి పంప్‌హౌస్‌లో కన్నా లక్ష్మి పంప్‌హౌస్‌లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. లక్ష్మి పంప్‌హౌస్‌లో మోటార్లు ఇంకా వర ద నీళ్లలోనే ఉండటంతో ఆ నీ టిని తోడిన తర్వాతే నష్టం ఏ మేరకు జరిగిందన్నదానిపై వాస్తవ అంచనాలకు రాగలమ ని  నివేదికలో పేర్కొన్నారు. లక్ష్మి పంప్‌హౌస్‌లో రక్షణగోడతో పాటు లోపల ఉన్న మూడు క్రేన్లలో రెండు క్రేన్లు, లిఫ్టు కూలిపోవడంతో ఆ ప్రభావం అంతా మోటార్లు, ప్యానల్‌ బోర్డులపై ఉంటుందని తేల్చా రు. దీనివల్ల నష్టం పెరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా గుర్తించారు. పంప్‌హౌస్‌ల రక్షణ గురించి నీటిపారుదల శాఖ (జలసౌధ) నుంచి అధికారుల బృందం గతంలోనే అప్రమత్తం చేసింది. ఆ సూచనలను బేఖాతరు చేయడంతోనే పంప్‌హౌస్‌లు నీటమునిగాయని అధికారులు గుర్తించారు.

Updated Date - 2022-08-04T09:35:48+05:30 IST