చేపల దొంగలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-31T00:43:45+05:30 IST

మండలంలోని చాడ గ్రామ చెరువులో గురువారం అర్ధరాత్రి చేపలు దొంగతనంచేసి ఆటోలో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

చేపల దొంగలపై కేసు నమోదు

మోటకొండూరు, డిసెంబరు 30: మండలంలోని చాడ గ్రామ చెరువులో గురువారం అర్ధరాత్రి చేపలు దొంగతనంచేసి ఆటోలో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఆర్‌.మధుసుధన తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం రహమతనగర్‌కు చెందిన గుండు వినోద్‌, మిర్యాలగూడ మండలం యాద్గిర్‌పల్లికి చెందిన జిట్టబోయిన ఎల్లయ్యలు అర్ధరాత్రి ఆటోలో అనుమానాస్పదంగా వెళ్తుండగా పెట్రోలింగ్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆటోలో చేపలు కనబడడంతో పోలీసులు ప్రశ్నించగా, దొంగతనంగా చేపలను పట్టి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. మత్స్య సహకార సంఘం చైర్మన గుర్రం మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై గతంలో వలిగొండ మండలం వెల్వెర్తి చెరువులో చేపలు దొంగతనం చేసినందుకు కేసు నమోదై ఉందని తెలిపారు.

Updated Date - 2022-12-31T00:43:45+05:30 IST

Read more