నల్లమల దారిలో.. ఊహించని బాటసారి

ABN , First Publish Date - 2022-11-25T03:48:28+05:30 IST

అది నల్లమలలోని లోతట్టు ప్రాంతం. నాగర్‌కర్నూలు జిల్లాలోని వటవర్లపల్లి, ఫరాహాబాద్‌ల మధ్య ఉన్న దట్టమైన అటవీ క్షేత్రం.

నల్లమల దారిలో.. ఊహించని బాటసారి

అది నల్లమలలోని లోతట్టు ప్రాంతం. నాగర్‌కర్నూలు జిల్లాలోని వటవర్లపల్లి, ఫరాహాబాద్‌ల మధ్య ఉన్న దట్టమైన అటవీ క్షేత్రం. సమయం ఉదయం 7 గంటలు. నడి అడవిలో అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఇంతలో శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పైకి ఓ పెద్ద పులి ఠీవీగా నడుచుకుంటూ వచ్చింది. అంతే.. ఆ దృశ్యాన్ని చూసిన వాహనదారుల గుండెలు జల్లుమన్నాయి. అంతలోనే తేరుకుని సెల్‌ఫోన్‌ కెమెరాలను ఓపెన్‌ చేశారు. పులి దర్జాగా రోడ్డు దాటుతున్న దృశ్యాలను క్లిక్‌మనిపించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఉదయం వేళ రోడ్డుపై పులి కన్పించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.

- అమ్రాబాద్‌

Updated Date - 2022-11-25T03:48:28+05:30 IST

Read more