South Central Railway: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-11-11T04:16:00+05:30 IST

శబరిమల వెళ్లి వచ్చే యాత్రికుల కోసం 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

South Central Railway: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): శబరిమల వెళ్లి వచ్చే యాత్రికుల కోసం 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబరు 20, డిసెంబరు 4, 18, జనవరి 8 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లంకు 4 రైళ్లు, నవంబరు 22, డిసెంబరు 6, 20, జనవరి 10తేదీల్లో కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు 4 రైళ్లు, నవంబరు 27, డిసెంబరు 11,25, జనవరి 1,15 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లంకు 5రైళ్లు, నవంబరు 29, డిసెంబరు 13,27, జనవరి 3,17 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌కు 5రైళ్లు, నవంబరు 21,28 తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లంకు 2 రైళ్లు, నవంబరు 23,30 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌కు 2రైళ్లు, నవంబరు 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌-కొట్టాయంకు 2 రైళ్లు, నవంబరు 21,28 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్‌కు 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-11-11T10:39:30+05:30 IST