ఆన్‌లైన్‌లో 2023 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

ABN , First Publish Date - 2022-11-28T01:58:44+05:30 IST

టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సర క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఆన్‌లైన్‌లో 2023 టీటీడీ  డైరీలు, క్యాలెండర్లు

తిరుమల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సర క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు, లేపాక్షి వద్ద, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం ముందున్న ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న బుక్‌ షాపుల్లో క్యాలెండర్లను, డైరీలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేస్తే తపాలా శాఖ ద్వారా ఇంటి వద్దకే చేరుతాయి.

Updated Date - 2022-11-28T01:58:45+05:30 IST