Google Pay: మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన సమాచారం!

ABN , First Publish Date - 2022-12-22T17:27:23+05:30 IST

డిజిటల్ లావాదేవీల (Digital transactions) వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) కూడా ఎక్కువయ్యాయి.

Google Pay: మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన సమాచారం!

న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల (Digital transactions) వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) కూడా ఎక్కువయ్యాయి. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్గాల్లో అమాయక జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల విషయంలో వినియోగదారుల మరింత అప్రమత్తం చేయడం లక్ష్యంగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ను (fraud detection) డిజిటల్ పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’ (Google Pay) ప్రవేశపెట్టింది. యాప్ చెల్లింపుల్లో మోసాల గుర్తింపు, అప్రమత్తలను మరింత పెంచడమే ముఖ్యుద్దేశ్యంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించినట్టు టెక్ దిగ్గజం గూగుల్ (Google) తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అనుమానిత యాక్టివిటీని గుర్తించినా వెంటనే యూజర్లకు మల్టీ-లేయర్ అలెర్ట్స్, హెచ్చరికలు జారీ అవుతాయి.

ఈ ఫీచర్ ద్వారా గూగుల్ పే వినియోగదారుల లావాదేవీల తీరు సమగ్రంగా విశ్లేషించబడుతుంది. ఆ తర్వాత ఈ విశ్లేషణకు విరుద్ధంగా ఎలాంటి లావాదేవీ జరిగినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ లావాదేవీల హిస్టరీని కూడా పొందొచ్చు. ‘ఈ వారంలో నిత్యావసరాలపై ఎంత ఖర్చు చేశాం?’ అనే ప్రశ్న మాదిరిగానే హిస్తరీని చెక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్‌గా సెక్యూరిటీ, ప్రైవేటు డిజైన్, యూజర్ల నియంత్రణ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ ప్రాథమిక అంశాలపై దృష్టిసారించినట్టు వెల్లడించింది. తద్వారా యూజర్లు సేఫ్ ఇన్ఫర్మేషన్‌ను పొందొచ్చని తెలిపింది.

Updated Date - 2022-12-22T17:27:55+05:30 IST