WestIndies vs India : తొలి వికెట్ కోల్పోయిన భారత్.. స్కోర్ ఎంతంటే..
ABN , First Publish Date - 2022-07-23T02:03:22+05:30 IST
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా(WestIndies vs India) వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్ వర్సెస్ ఇండియా(WestIndies vs India) వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా(Team India) ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు శిఖర్ ధవన్(Shikar Dhavan), శుభ్‌మన్ గిల్(Subhman Gill) ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ధవన్ 50 పరుగులు, శుభ్‌మన్ గిల్ 64 పరుగులతో మొదటి వికెట్‌కు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 119 వద్ద తొలి వికెట్‌గా గిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 64 పరుగులు చేసిన గిల్ చక్కటి షాట్లు ఆడాడు. కాగా ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ‘క్వీన్స్ పార్క్ ఓవర్’ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ జట్టు ఇదీ..
శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్ధూల్ థాకూర్, మొహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహాల్, ప్రసిద్ధ్ క్రిష్ణ.