‘విరాట్‌.. త్వరలో భారత్‌లో కలుద్దాం’

ABN , First Publish Date - 2022-09-30T09:25:55+05:30 IST

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఇటీవలే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

‘విరాట్‌.. త్వరలో భారత్‌లో కలుద్దాం’

న్యూఢిల్లీ: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఇటీవలే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా కోహ్లీ.. ఫెడెక్స్‌కు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ట్విటర్‌లో పోస్టు చేసింది. దీనికి స్పందించిన ఫెడరర్‌.. ‘థ్యాంక్యూ విరాట్‌. త్వరలో భారత్‌లో కలుస్తామని ఆశిస్తున్నా’ అని ఇన్‌స్టాలో విరాట్‌కు రిప్లై ఇచ్చాడు. ‘ఈ సందేశాన్ని పంపడం గౌరవంగా భావిస్తున్నా. ప్రపంచ నలుమూలల నుంచి నీకు లభిస్తున్న సంఘీభావం, మద్దతు.. మరే అథ్లెట్‌ విషయంలోనూ చూడలేదు’ అని రోజర్‌కు పంపిన వీడియోలో కోహ్లీ ప్రశంసించాడు.  

Read more