Womens T20 Challenge: ట్రయల్‌బ్లేజర్స్‌పై టాస్ నెగ్గిన వెలాసిటీ
ABN , First Publish Date - 2022-05-27T00:58:52+05:30 IST
మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా ట్రయల్‌బ్లేజర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో వెలాసిటీ కెప్టెన్ దీప్తిశర్మ టాస్

పూణె: మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా ట్రయల్‌బ్లేజర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో వెలాసిటీ కెప్టెన్ దీప్తిశర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో వెలాసిటీ జట్టు సూపర్నోవాస్ జట్టుపై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో షెఫాలి, వోల్వ్డార్ట్ అర్ధ సెంచరీలు సాధించారు. అయితే, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ట్రయల్బ్లేజర్స్ను సూపర్ నోవాస్ చిత్తు చేసింది. ట్రయల్‌బ్లేజర్స్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఆ జట్టు నెట్ రన్‌రేట్ కూడా ఏమంత బాగాలేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో వెలాసిటీని ఓడించి ఖాతా తెరవాలని స్మృతి మంధాన జట్టు పట్టుదలగా ఉంది.