అండర్-19 ప్రపంచ‌కప్ ఫైనల్... టాస్ గెలిచిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2022-02-06T00:13:12+05:30 IST

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు మరో ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసింది

అండర్-19 ప్రపంచ‌కప్ ఫైనల్... టాస్ గెలిచిన ఇంగ్లండ్

అంటిగ్వా: అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు మరో ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసింది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. 


ఈ ప్రపంచకప్‌లో యశ్‌ ధుల్‌ సేన ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం గమనార్హం.  ఫైనల్‌ పోరులోనూ అదే జోరును కొనసాగించాలని గట్టి పట్టుదలగా ఉంది. అదే జరిగితే భారత్‌ ఖాతాలో ఐదో టైటిల్‌ చేరుతుంది. ఇప్పటి వరకు జరిగిన 14 టోర్నమెంట్లలో యువ భారత్‌ ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరగా.. నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచింది.

Updated Date - 2022-02-06T00:13:12+05:30 IST