సిరీస్‌ లక్ష్యంగా..

ABN , First Publish Date - 2022-10-11T08:54:28+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్‌ గెలవడంతో నిర్ణాయక ఆఖరి వన్డే ఆసక్తికరంగా మారనుంది.

సిరీస్‌ లక్ష్యంగా..

దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి వన్డే నేడు

మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్‌ గెలవడంతో నిర్ణాయక ఆఖరి వన్డే ఆసక్తికరంగా మారనుంది. ఇరుజట్ల మధ్య మంగళవారం అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ పోరు జరుగనుంది. టీ20 ప్రపంచక్‌పనకు ముందు ఈ మ్యాచ్‌లు పెద్దగా ప్రయోజనం లేకపోయినా.. పర్యాటక జట్టు సిరీస్‌ నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఆసీ్‌సలో అడుగుపెట్టాలనుకుంటోంది. అంతేకాకుండా వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ పట్టికలో ఈ జట్టు తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్‌క్‌పనకు నేరుగా అర్హత సాధించాలంటే సఫారీలకు ఈ గెలుపుతో వచ్చే పది పాయింట్లు అత్యవసరం. కెప్టెన్‌ బవుమా, స్పిన్నర్‌ షంసీ ఫిట్‌నెస్‌ తేలాల్సి ఉంది. 


ఓపెనింగ్‌ మెరుగవ్వాలి:

ధవన్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు మరోసారి ఆల్‌రౌండ్‌షోతో సత్తా చాటాలనుకుంటోంది. రోహిత్‌ కెప్టెన్సీలోని టీ20 జట్టు ఇప్పటికే ఆసీ్‌సలో ఉంది. బుమ్రా స్థానంలో మరో పేసర్‌ కోసం జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ.. జోరు మీదున్న పేసర్‌ సిరాజ్‌ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలనుకుంటున్నాడు. స్పిన్నర్లు సుందర్‌, షాబాజ్‌ మరింతగా రాణించాలి. అయితే డెత్‌ ఓవర్లలో జట్టు బౌలింగ్‌ మెరుగవ్వడంతో పాటు బ్యాటర్లు అదరగొడుతుండడం సానుకూలాంశం. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన ఓపెనర్లు ధవన్‌, గిల్‌ జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరముంది. గిల్‌కు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. మిడిలార్డర్‌లో ఇషాన్‌, శ్రేయాస్‌, శాంసన్‌ త్రయం జట్టుకు అండగా ఉండడంతో రాంచీ మ్యాచ్‌లో గెలిచి సిరీ్‌సలో నిలువగలిగింది. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.


తుది జట్లు (అంచనా)

 భారత్‌:

ధవన్‌ (కెప్టెన్‌), గిల్‌, ఇషాన్‌, శ్రేయాస్‌, శాంసన్‌, సుందర్‌, షాబాజ్‌, శార్దూల్‌, కుల్దీప్‌, అవేశ్‌ ఖాన్‌, సిరాజ్‌.


దక్షిణాఫ్రికా:

మలాన్‌, డికాక్‌, బవుమా/హెన్‌డ్రిక్స్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, పార్నెల్‌, మహరాజ్‌, ఫోర్టాన్‌/షంసీ, రబాడ, నోకియా.

Updated Date - 2022-10-11T08:54:28+05:30 IST