జింబాబ్వే టూర్కు హెడ్కోచ్ లక్ష్మణ్
ABN , First Publish Date - 2022-08-13T09:38:02+05:30 IST
జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు.

న్యూఢిల్లీ : జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం వెల్లడించాడు. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఈనెల 18, 20, 22 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. రాహుల్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకుంటున్నందున లక్ష్మణ్ హెడ్కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని షా వివరించాడు. కాగా..ఈనెల 27న ప్రారంభమయ్యే ఆసియాకప్ కోసం టీమిండియాతో కలిసి ద్రవిడ్ 23నయూఏఈ చేరుకుంటాడు.