‘కెనడియన్’ విజేత హలెప్
ABN , First Publish Date - 2022-08-16T12:07:16+05:30 IST
ప్రపంచ టెన్నిస్ మాజీ నెంబర్‌వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ కెనడియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది.

టొరొంటో: ప్రపంచ టెన్నిస్ మాజీ నెంబర్‌వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ కెనడియన్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రొమేనియా స్టార్ హలెప్ 6-3, 2-6, 6-3తో బ్రెజిల్‌కు చెందిన బేట్రిజ్ హదాద్ మయియాను ఓడించి మూడోసారి ఈ ట్రోఫీని అందుకుంది. రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన హలె్పకిది కెరీర్లో తొమ్మిదో డబ్ల్యూటీఏ 1000 టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో హలెప్ ఆరో ర్యాంకుతో మళ్లీ టాప్-10లోకి రానుంది.