తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ABN , First Publish Date - 2022-03-04T15:27:55+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‎లో టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది

తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు. తొలి టెస్టులోనే రోహిత్ టాస్ గెలవడం విశేషం. ఇక ఈ మ్యాచ్ మాజీ సారథి విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది విరాట్‌కు వందో టెస్టు. 2011లో విండీస్‎తో విరాట్‌ తొలి టెస్టు ఆడాడు. అలాగే ఏడేళ్లపాటు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఇప్పుడు కేవలం ఓ బ్యాటర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీ‌స్‎ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.


జట్లు 

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, జయంత్‌ యాదవ్, మహ్మద్ షమి, జస్పిత్ బుమ్రా.

శ్రీలంక: కరుణరత్నె (కెప్టెన్‌), లాహిరు తిరిమన్నె, నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, అసలంక, డిక్‌వెల్లా, సురంగ లక్మల్‌, లసిత్‌ ఎంబుల్డెనియా, ఫెర్నాండో, లాహిరు కుమార. 

Read more