తొలి టెస్టు: భారీ స్కోర్ దిశగా టీమిండియా..

ABN , First Publish Date - 2022-03-05T16:41:44+05:30 IST

లంకతో జరగుతున్న తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి రోజు టీమిండియా 357 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో నిలిచింది

తొలి టెస్టు: భారీ స్కోర్ దిశగా టీమిండియా..

మొహాలీ: శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో భారీ స్కోర్ దిశగా భారత్ జట్టు పయనిస్తోంది. తొలి రోజు టీమిండియా 357 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో నిలిచింది. రెండో రోజు 357/6తో ఆటను ప్రారంభించిన భారత్ జట్టు 400 స్కోర్ మార్క్‎ను ధాటింది. రవీంద్ర జడేజా 148 బంతుల్లో 9 ఫోర్లతో 90 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు. అతనికి తోడుగా రవించంద్రన్ అశ్విన్ 73 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు చేసి తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఆరు వికెట్లను కోల్పోయి 447 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, అశ్విన్ నిలకడగా ఆడుతున్నారు.

Updated Date - 2022-03-05T16:41:44+05:30 IST