తెలుగు యోధాస్‌ రెండో గెలుపు

ABN , First Publish Date - 2022-08-17T10:05:56+05:30 IST

ఆరంభ అల్టిమేట్‌ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

తెలుగు యోధాస్‌ రెండో గెలుపు

పుణె: ఆరంభ అల్టిమేట్‌ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆదర్శ్‌ మోహిత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో తెలుగు యోధాస్‌ 68-47 స్కోరు తేడాతో రాజస్థాన్‌ వారియర్స్‌ను చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 30-20తో ఆధిక్యంలో ఉన్న యోధాస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదేజోరుతో విజృంభించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఆదర్శ్‌తో పాటు ప్రసాద్‌ తెలుగు జట్టులో రాణించాడు.  

Updated Date - 2022-08-17T10:05:56+05:30 IST