జాతీయ ఫెన్సింగ్‌లో తెలంగాణ తీన్మార్
ABN , First Publish Date - 2022-07-03T09:38:35+05:30 IST
జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ ఫెన్సర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ ఫెన్సర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. కటక్‌లో శనివారం ముగిసిన ఈ పోటీల్లో బాలుర ఈపీ టీమ్ ఈవెంట్లో లోకేష్, మురళి, వంశీ, శశాంక్‌తో కూడిన తెలంగాణ జట్టు ఫైనల్లో 45-28తో మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. బాలికల సబ్రె టీమ్ ఈవెంట్లో గౌరి, సమీక్ష, బేబీ రెడ్డి, శిరీష నేతృత్వంలోని బృందం రజతంతో మెరిసింది. బాలుర ఫాయిల్ టీమ్ విభాగంలో మణికంఠ, ఇలియాస్, తనిష్క్ జాదవ్, నిఖిలేష్ బృందం కాంస్యంతో సరిపెట్టుకుంది. జాతీయ పోటీల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులను తెలంగాణ ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు.