జాతీయ ఖో-ఖో క్వార్టర్స్‌లో తెలంగాణ
ABN , First Publish Date - 2022-12-29T01:08:08+05:30 IST
జాతీయ జూనియర్ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు క్వార్టర్స్ చేరింది...
హైదరాబాద్: జాతీయ జూనియర్ ఖో-ఖో చాంపియన్‌షి్‌పలో తెలంగాణ బాలుర జట్టు క్వార్టర్స్ చేరింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరుగుతున్న ఈ పోటీల ప్రీక్వార్టర్స్‌లో తెలంగాణ 18-12తో హరియాణాపై గెలిచింది. తెలంగాణ బాలికల జట్టు 4-10తో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది. కాగా,ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు కర్ణాటక చేతిలో 10-18తో ఓడింది. బాలికల జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది.