ఈసారీ పాక్‌తోనే షురూ

ABN , First Publish Date - 2022-01-22T09:08:37+05:30 IST

వరుసగా రెండో ఏడాది క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు టీ20 ప్రపంచకప్‌ ముస్తాబవుతోంది.

ఈసారీ పాక్‌తోనే షురూ

గ్రూప్‌-2లో టీమిండియా

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌

అక్టోబరు 22 నుంచి నవంబరు 13 వరకు


దుబాయ్‌: వరుసగా రెండో ఏడాది క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు టీ20 ప్రపంచకప్‌ ముస్తాబవుతోంది. అక్టోబరు 22 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను శుక్రవారం ఐసీసీ విడుదల చేసింది. అయితే ఈసారి కూడా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూప్‌ (2)లో ఉన్నాయి. అలాగే అక్టోబరు 23న ఎంసీజీలో జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టుతోనే రోహిత్‌ సేన టైటిల్‌ వేటను ఆరంభించనుంది.  గ్రూప్‌ 2లో భారత్‌, పాక్‌తో పాటు బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, గ్రూప్‌-బి విజేత, గ్రూప్‌-ఎ రన్నరప్‌ జట్లు ఉన్నాయి. మరోవైపు ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. గ్రూప్‌-1లో ఆసీస్‌, కివీస్‌, ఇంగ్లండ్‌, అఫ్ఘానిస్థాన్‌, గ్రూప్‌-ఎ విజేత, గ్రూప్‌-బి రన్నరప్‌ జట్లు ఉన్నాయి. సెమీఫైనల్స్‌ నవంబరు 9, 10న సిడ్నీ, అడిలైడ్‌లో.. తుది పోరు 13న మెల్‌బోర్న్‌లో జరుగుతాయి. శ్రీలంక, విండీస్‌ జట్లు సూపర్‌ 12లో ప్రవేశం కోసం అర్హత రౌండ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2020లోనే జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. ?


భారత జట్టు షెడ్యూల్‌ ఇదే 

తేదీ  ప్రత్యర్థి              వేదిక

అక్టోబరు 23   పాకిస్థాన్‌               మెల్‌బోర్న్‌

అక్టోబరు 27   గ్రూప్‌ ‘ఎ’ రన్నరప్‌   సిడ్నీ

అక్టోబరు 30         దక్షిణాఫ్రికా         పెర్త్‌

నవంబరు 2         బంగ్లాదేశ్‌         అడిలైడ్‌

నవంబరు 6     గ్రూప్‌ ‘బి’ విజేత         మెల్‌బోర్న్‌

Updated Date - 2022-01-22T09:08:37+05:30 IST