లండన్‌లో తానియా సొత్తు చోరీ

ABN , First Publish Date - 2022-09-27T09:30:55+05:30 IST

లండన్‌లోని హోటల్‌లో తన సామగ్రి చోరీకి గురైనట్టు భారత మహిళల జట్టు వికెట్‌ కీపర్‌ తానియా భాటియా వెల్లడించింది.

లండన్‌లో తానియా సొత్తు చోరీ

న్యూఢిల్లీ: లండన్‌లోని హోటల్‌లో తన సామగ్రి చోరీకి గురైనట్టు భారత మహిళల జట్టు వికెట్‌ కీపర్‌ తానియా భాటియా వెల్లడించింది. మూడు వన్డేల సిరీ్‌స కోసం టీమిండియా.. ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా లండన్‌లోని మారియట్‌ హోటల్‌లో భారత జట్టుకు బస ఏర్పాటు చేశారు. అయితే, ఎవరో తన గదిలోకి చొరబడి డబ్బులున్న బ్యాగ్‌, కార్డులు, వాచీలు, నగలు దొంగతనం చేశారని తానియా ట్వీట్‌ చేసింది. ఇంగ్లండ్‌ బోర్డు తగిన రక్షణ కల్పించలేదని ఆరోపించింది. కాగా, తానియా ఫిర్యాదుపై స్పందించిన హోటల్‌ యాజమాన్యం.. దీనికి సంబంధించిన వివరాలు అందజేయాలని కోరింది. 

Read more