సఫారీలతో పోరుకు సై

ABN , First Publish Date - 2022-09-27T09:36:38+05:30 IST

టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత జట్టు మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది.

సఫారీలతో పోరుకు సై

రేపటి నుంచి మూడు టీ20ల సిరీస్‌

 ఆ తర్వాత వన్డేలు

తిరువనంతపురం: టీ20 ప్రపంచక్‌పనకు ముందు భారత జట్టు మరో సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో మూడోసారి దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సై అంటోంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరిగింది. తాజాగా టీ20, వన్డే సిరీ్‌సల కోసం బవుమా నేతృత్వంలోని సఫారీ జట్టు భారత పర్యటనకు వచ్చింది. మొదటగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీ్‌సకు తెర లేవనుంది. అలాగే టీ20 ప్రపంచక్‌పనకు ముందు ఈ ఫార్మాట్‌లో రెండు జట్లకు కూడా ఇదే చివరి అవకాశం.


పని ఒత్తిడిలో భాగంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ ఈ సిరీ్‌సకు దూరం కానున్నారు. ఈ ఇద్దరూ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పునరావాస శిబిరంలో చేరనున్నారు. హార్దిక్‌ సోమవారమే బెంగళూరు చేరుకున్నాడు. వచ్చే నెల తొలివారంలో వీరు జట్టుతో పాటు చేరి మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. 


వన్డే జట్టు ప్రకటన ఎప్పుడు..?:

ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో జరిగే పొట్టి సిరీ్‌సలతో పాటు టీ20 ప్రపంచకప్‌ కోసం కూడా ఇదివరకే భారత జట్టును ప్రకటించారు. అయితే అక్టోబరు 6 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీ్‌సకు మాత్రం సెలెక్టర్లు ఇంకా టీమ్‌ను వెల్లడించలేదు. ఇదిలావుండగా మెగా టోర్నీకి ముందు వన్డేలతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బహుశా ఈ సిరీ్‌సకు టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ ఆటగాళ్లు దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే రోహిత్‌ స్థానంలో శిఖర్‌ ధవన్‌ మరోసారి జట్టు సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే కివీస్‌ ‘ఎ’తో ఇటీవల ముగిసిన వన్డే సిరీ్‌సలో సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ విశేషంగా రాణించారు. దీంతో ఈ టీమ్‌లో వీరి ఎంపిక ఖాయంగానే కనిపిస్తోంది. 


ప్రాక్టీస్‌ మొదలెట్టారు

టీమిండియాతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా బృందం ఆదివారం రాత్రే భారత్‌కు చేరుకుంది. బుధవారం నుంచి టీ20 సిరీస్‌ జరుగనుండగా.. ఆ మ్యాచ్‌ వేదికైన తిరువనంతపురంలో ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. హోటల్‌లో అడుగుపెట్టడానికి ముందు స్థానిక సంప్రదాయం ప్రకారం ప్లేయర్స్‌కు తిలకం దిద్ది, మెడలో పూలదండ వేసి హారతిచ్చారు. ఇక సోమవారం ఆటగాళ్లంతా నెట్‌ ప్రాక్టీ్‌సలో గడిపారు.

Read more