నేడు భారత్‌ X ఆసీస్ వామప్‌ మ్యాచ్‌

ABN , First Publish Date - 2022-10-17T09:50:38+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో ఉన్న టీమిండియా నేటి నుంచి వామప్‌ మ్యాచ్‌లను ఆడనుంది.

నేడు భారత్‌ X ఆసీస్ వామప్‌ మ్యాచ్‌

ఉ. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్‌లో..

చిన్నోడి బౌలింగ్‌కు రోహిత్‌ ఫిదా

బ్రిస్బేన్‌: టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో ఉన్న టీమిండియా నేటి నుంచి  వామప్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ముందుగా సోమవారం గాబా మైదానంలో ఆస్ట్రేలియాను ఎదుర్కోనుండగా.. 19న చివరిదైన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను కివీస్‌తో ఇక్కడే ఆడనుంది. వీటికంటే ముందే వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌ల్లో భారత జట్టు ఒకటి గెలిచి మరోటి చిత్తుగా ఓడింది. తుది కూర్పుపై స్పష్టత కోసం రోహిత్‌ సేన ఈ రెండు వామప్‌ మ్యాచ్‌లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే రాహుల్‌ ఫామ్‌లో ఉన్నా, కెప్టెన్‌ రోహిత్‌ ఆశించిన మేర ఆడడం లేదు. బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన పేసర్‌ షమిపై అందరి దృష్టి ఉండనుంది. నెట్స్‌లో తను తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోను బోర్డు ట్వీట్‌ చేసింది. ఈ రెండు మ్యాచ్‌లను గెలిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసంతో తమ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-10-17T09:50:38+05:30 IST