డైమండ్‌ లీగ్‌లో శ్రీశంకర్‌కు ఆరో స్థానం

ABN , First Publish Date - 2022-08-12T09:27:48+05:30 IST

డైమండ్‌ లీగ్‌ లాంగ్‌తజంప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కామన్వెల్త్‌ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌ తీవ్రంగా నిరాశపర్చాడు.

డైమండ్‌ లీగ్‌లో శ్రీశంకర్‌కు ఆరో స్థానం

మొనాకో: డైమండ్‌ లీగ్‌ లాంగ్‌తజంప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కామన్వెల్త్‌ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలిసారి ఈ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రీశంకర్‌ 7.94 మీటర్లు మాత్రమే దూకి ఆరో స్థానంలో నిలిచాడు. బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో మురళీ 8.08 మీటర్లు లంఘించాడు. క్యూబాకు చెందిన మెకెల్‌ మస్సో (8.35 మీ.) స్వర్ణం.. గ్రీస్‌ అథ్లెట్‌ మిల్టియాడిస్‌ టెంటోగ్లో రజతం, అమెరికాకు చెందిన మార్క్విస్‌ డెండీ కాంస్యం సాధించారు. 

Updated Date - 2022-08-12T09:27:48+05:30 IST