‘పింక్‌ జెర్సీ’ ఎక్కడ?

ABN , First Publish Date - 2022-05-30T11:04:50+05:30 IST

‘పింక్‌ జెర్సీ’ ఎక్కడ?

‘పింక్‌ జెర్సీ’ ఎక్కడ?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ అధికారిక ప్రసారకర్తలపై రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ భార్య చారులత తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో విరుచుకుపడింది. అందునా రాజస్థాన్‌, గుజరాత్‌ మధ్య జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టడం మరింత ఆసక్తి రేకెత్తించింది. రాయల్స్‌ పట్ల ఎంత చులకనగా వ్యవహరించారో ఎత్తి చూపింది. ఐపీఎల్‌ విడుదలచేసిన ఈ సీజన్‌ యానిమేషన్‌ సిరీస్‌ స్నాప్‌షాట్‌ను పోస్టు చేసిన ఆమె.. ఇందులో ‘పింక్‌ జెర్సీ’ ఎక్కడ? అని ప్రశ్నించింది. ఈ యానిమేషన్‌ వీడియోలో రాజస్థాన్‌ మినహా మిగిలిన 9 జట్ల ఆటగాళ్లు తమతమ టీమ్‌ జెర్సీలతో కనిపించారు. ‘ఐపీఎల్‌-2022 తొలి రోజు ఈ వీడియో చూశాను. అయితే, రాజస్థాన్‌ ధరించే ‘పింక్‌ జెర్సీ’ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింద’ని చారులత విమర్శించింది. ఆ తర్వాత ఫైనల్‌కు చేరుకున్న రాయల్స్‌ టీమ్‌ ఫొటోను షేర్‌ చేసింది. మొత్తంగా సరైన సమయంలో బ్రాడ్‌కాస్టర్లను ఆమె కడిగిపడేసిందని నెటిజన్లు కామెంట్లు చేసున్నారు. . 

Read more