షమి లేకుండానా?

ABN , First Publish Date - 2022-09-08T10:16:10+05:30 IST

షమి లేకుండానా?

షమి లేకుండానా?

జట్టు ఎంపికపై రవిశాస్త్రి


దుబాయ్‌: ఆసియా కప్‌లో శ్రీలంకతో సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తీవ్రంగా స్పందించాడు. సీనియర్‌ పేసర్‌ షమిని అసలు జట్టులోకి తీసుకోకపోవడమేమిటని ప్రశ్నించాడు. ‘ఇక్కడి పరిస్థితుల గురించి తెలిసిందే. పిచ్‌లు స్పిన్నర్లకు సహకరించడంలేదు. హార్దిక్‌ సహా కేవలం నలుగురు పేసర్లతోనే భారత్‌ టోర్నీకి రావడం ఆశ్చర్యం కలిగించింది. అదనంగా ఒక ఫాస్ట్‌ బౌలర్‌ ఉండాలి. ఐపీఎల్‌లో రాణించి, ఫిట్‌గా ఉన్న షమికి జట్టులో చోటు లేకపోవడమేమిటి’ అని రవిశాస్త్రి తీవ్రంగా స్పందించాడు. 

Read more